: అబద్ధాలు చెప్పవచ్చు కానీ, చరిత్రను తిరగరాయలేరు: చంద్రబాబు
కొల్లేరు అంశంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ మధ్య మాటల యుద్ధం సాగింది. కొల్లేరుపై వైఎస్ హయాంలోనే తీర్మానం పెట్టారని, తాజా తీర్మానం రాజకీయ అవసరాల కోసమేనని జగన్ ఆరోపించడంపై చంద్రబాబు దీటుగా బదులిచ్చారు. అప్పట్లో కొల్లేరును బాంబులు, ప్రొక్లెయిన్లతో ధ్వంసం చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేశారని బాబు వెల్లడించారు. దీనిపై తాము నిలదీసిన తర్వాతే భయపడి అసెంబ్లీలో తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. అబద్ధాలు చెప్పవచ్చు గానీ, చరిత్రను తిరగరాయలేరు అని ఈ సందర్భంగా బాబు ఎత్తిపొడిచారు. అవసరమైతే కొల్లేరు సమస్యపై నిపుణుల కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.