: ముగిసిన లోక్ సభ శీతాకాల సమావేశాలు
లోక్ సభ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఈ మేరకు సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రకటించారు. మొత్తం 18 బిల్లులు దిగువ సభలో ఆమోదం పొందగా, రాజ్యసభలో ఇప్పటివరకు 11 బిల్లుల వరకు ఆమోదం పొందాయి. ఇంకా నేడు బొగ్గు క్షేత్రాల బిల్లు, బీమా బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. నవంబర్ 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి.