: జమ్మూ కాశ్మీర్ ఫలితాలు మాకు అతి పెద్ద విజయం: జవదేకర్
జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. జార్ఖండ్ లో బీజేపీ కూటమి పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తుండగా... జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ, బీజేపీలు పోటాపోటీగా ఉన్నాయి. వెలువడుతున్న ఫలితాలలో బీజేపీ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. టపాసులు కాల్చడం, మిఠాయిలు పంచుకోవడం ప్రారంభమయింది. ఫలితాల సరళిపై బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ లో వెలువడుతున్న ఫలితాలు తమ పార్టీకి అతి పెద్ద విజయమని అన్నారు. తమ పార్టీ ఓట్ల శాతం అనూహ్యంగా పెరిగిందని తెలిపారు. జార్ఖండ్ లో బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలకు... అద్భుత పాలన అందించి వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు.