: సాయంత్రం 5 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ


బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ నేటి సాయంత్రం 5 గంటలకు జరగనుంది. నేటి మధ్యాహ్నానికి వెలువడనున్న జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఈ భేటీలో పార్టీ నేతలు చర్చించనున్నారు. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీ ఫలితాలను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలన్న విషయంపై ఈ భేటీలో పార్టీ అగ్రనేతలు చర్చించనున్నారు. అంతేకాక జమ్మూ కాశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా ఈ భేటీలో పార్టీ ముఖ్యులు దృష్టి సారించనున్నారు.

  • Loading...

More Telugu News