: రెండేళ్ల తరువాత భారత్ లో వాల్ మార్ట్ కొత్త స్టోర్


అమెరికాకు చెందిన రిటైల్ మేజర్ వాల్ మార్ట్ సంస్థ రెండేళ్ల విరామం తరువాత భారత్ లో కొత్త స్టోర్ ను ప్రారంభించబోతోంది. ఈ మేరకు ఆగ్రాలో స్టోర్ ను ఏర్పాటు చేయనుంది. చివరిగా 2012లో భోపాల్లో తన స్టోర్ ను వాల్ మార్ట్ ప్రారంభించింది. "భారత్ లో విస్తరణకు వాల్ మార్ట్ కట్టుబడింది. వృద్ధి ప్రణాళికలపై మేము దృష్టి పెట్టాం. ఆగ్రాలో స్టోర్ నెలకొల్పేందుకు అన్ని రకాల అంతర్గత అనుమతులు పొందాము. సిటీలో ఇది మా రెండవ స్టోర్. వచ్చే ఏడాదిలో ప్రారంభించబోయే స్టోర్ కు సంబంధించిన లైసెన్సులు, అనుమతులు పొందే పనిలో ప్రస్తుతం మా టీమ్ పనిచేస్తోంది" అని వాల్ మార్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News