: డీఆర్ఎస్ అలాంటి వాళ్ల కోసం ఉపయోగించవచ్చు: రవిశాస్త్రి


బీసీసీఐ ఎప్పటి నుంచో విముఖత వ్యక్తం చేస్తున్న నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్)పై టీమిండియా కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి తన అభిప్రాయాలు తెలిపాడు. అతిగా అప్పీలు చేసే వారికోసం 'డీఆర్ఎస్' సాంకేతికతను ఉపయోగించవచ్చని అన్నాడు. కానీ, ఓ నిర్ణయ సమీక్ష కోసం బౌలర్ ప్రాధేయపడుతున్నట్టుగా అప్పీలు చేయరాదని పేర్కొన్నాడు. ఇక, ఈ టెక్నాలజీ వాడుకను బీసీసీఐ వ్యతిరేకించడానికి గల కారణాలను ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు. ప్రస్తుతం వినియోగిస్తున్న టెక్నాలజీ పరిధి, దాన్ని ఎవరు, ఎప్పుడు ఉపయోగించాలన్న అంశాలపై తమకు స్పష్టత కావాలని తెలిపాడు. పైగా, డీఆర్ఎస్ లో అనుసరిస్తున్న బాల్ ట్రాకింగ్ సాంకేతిక పరిజ్ఞానంపై వ్యతిరేక భావనలు ఉన్నాయని, ఆ టెక్నాలజీ బంతి టర్న్, బౌన్స్ ను అంచనా వేస్తుందనడంపై తనకు నమ్మకం లేదని శాస్త్రి పేర్కొన్నాడు. డీఆర్ఎస్ ను మెరుగు పరిస్తే తమకు ఆమోదయోగ్యమేనని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News