: సైనిక పాఠశాలపై దాడి జరగవచ్చని ముందే హెచ్చరికలు... పెడచెవిన పెట్టిన పాక్!
పాకిస్తాన్ లోని ఆర్మీ పాఠశాలలపై తాలిబాన్లు పెద్ద ఎత్తున దాడి జరపవచ్చని నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయట. ఖైబర్ ప్రావిన్స్ అధికారులు డిసెంబర్ 16 కన్నా ఎంతో ముందే ఈ హెచ్చరికలు చేశారని తెలుస్తోంది. తాలిబాన్ కామాండర్ ఖక్సర్ ఒరకాజి, మరో ఇద్దరు ఉగ్రవాదులు బిలాల్, ఒబైదుల్లాలతో కలసి సైన్యం నియంత్రణలోని విద్యా సంస్థలపై దాడులకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వక సమాచారాన్ని ఆగష్టు 28న పంపినట్టు ఖైబర్ హోం శాఖ అధికారులు తెలిపారు. ఈ హెచ్చరికలను పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఉంటే 140 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలసిపోకుండా కాపాడే అవకాశం లభించేదేమో!