: శ్రీవారిని దర్శించుకున్న రఘువీరా, జానారెడ్డి


తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత జానారెడ్డి శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వీరు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News