: తిరుమలలో లడ్డూల కోసం నకిలీ టోకెన్లు... పోలీసుల దర్యాప్తు ప్రారంభం


తిరుమల వెంకన్న ప్రసాదం కోసం కొందరు వ్యక్తులు నకిలీ టోకెన్లను సృష్టించారు. భారీ క్యూలైన్లలో అసలు టోకెన్లు తీసుకుని లడ్డూల కోసం వెళుతున్న వారితో కలిసిపోతూ కొందరు వ్యక్తులు నకిలీ టోకెన్లతో లడ్డూలను తీసుకుంటున్న వైనం నేటి ఉదయం వెలుగుచూసింది. నకిలీ టోకెన్లను పసిగట్టిన లడ్డూ కౌంటర్ల సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన తిరుమల పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే నకిలీ టోకెన్లతో పెద్ద సంఖ్యలో లడ్డూలను నిందితులు స్వాహా చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News