: కాకా మృతికి చంద్రబాబు, కేసీఆర్ సంతాపం
పెద్దపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు జి.వెంకటస్వామి మృతికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు తమ సంతాపం ప్రకటించారు. పెద్దపల్లి నుంచి నాలుగు సార్లు విజయం సాధించడంతో పాటు మొత్తం ఏడు సార్లు ఎంపీగా గెలిచిన వెంకటస్వామి, కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్నారు. వెంకటస్వామి కేంద్ర మంత్రిగానే కాక ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగానూ సేవలందించారు. ఆయన మృతి పట్ల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీసీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తదితర ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.