: నేడే జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మరికొద్దిసేపట్లో రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రెండు రాష్ట్రాల్లో ఐదు విడతలుగా జరిగిన ఎన్నికలు మూడు రోజుల క్రితం ముగిశాయి. జార్ఖండ్ సహా జమ్మూ కాశ్మీర్ లో తమకే అధికారం దక్కుతుందని బీజేపీ చెబుతోంది. జార్ఖండ్ లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చినా, జమ్మూ కాశ్మీర్ లో మాత్రం పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. నేటి మధ్యాహ్నం లోగా రెండు రాష్ట్రాల్లో పూర్తి స్థాయి ఫలితాలు రానున్నాయి.