: పొంగ మంచు కారణంగా 173 విమాన సర్వీసులకు ఆటంకం
ఉత్తరాది రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. దిగజారిన ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 173 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. పొంగ మంచు దట్టంగా అలముకోవడంతో వెలుతురు మందగించి విజిబిలిటి 50 మీటర్ల దిగువకు పడిపోయింది. దీంతో ఇంచుమించు ఆరు గంటల పాటు విమాన రాకపోకలు స్తంభించాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రెండు విమాన సర్వీసులు రద్దు చేశారు.