: కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (కాకా) కన్నుమూత
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి (92) మృతి చెందారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఏడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.