: బీజేపీ, కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోం: ఒమర్ అబ్దుల్లా


జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడడంతో నేతలు ఆసక్తికర ఎత్తుగడలు వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు విచారించడం లేదని ఆయన వివరించారు. మతమార్పిళ్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పడం లేదని ఆయన విమర్శించారు. కాగా, పీడీపీ తాజా ఎన్నికల్లో సత్తా చాటడంతో, ఆ పార్టీతో పొత్తు కోసం అబ్దుల్లా తాజా వ్యాఖ్యలు చేశారని బీజేపీ విమర్శిస్తోంది.

  • Loading...

More Telugu News