: ఉగ్రవాదంపై సమర శంఖం... పాకిస్థాన్ చారిత్రాత్మక నిర్ణయం!


పాకిస్థాన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన పాశవిక దాడితో ఆ దేశం కళ్లు తెరిచింది. ఇప్పుడు ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తోంది. దాడులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే సుమారు 500 మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేస్తామని పాకిస్థాన్ మంత్రి ప్రకటన చేశారు. ఉగ్రవాదులకు శిక్షలను వేగవంతం చేయనున్నామని పాక్ స్పష్టం చేసింది. పాక్ మంత్రి ప్రకటన వాస్తవరూపం దాలిస్తే, ప్రపంచ ఉగ్రవాద సమస్యకు సగం పరిష్కారం దొరికినట్టే. తీవ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్ లో కఠిన చర్యలు తీసుకుంటే తీవ్రవాదులు నిలువ నీడ కోల్పోయినట్టే!

  • Loading...

More Telugu News