: మత మార్పిళ్లను ప్రోత్సహించడం లేదు: వెంకయ్యనాయుడు
దేశంలో మతమార్పిళ్ల అంశంపై నరేంద్రమోదీ ప్రభుత్వం ఇంకా విమర్శల దాడి ఎదుర్కొంటూనే ఉంది. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని లోక్ సభలో ఈరోజు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ప్రభుత్వంగానీ, బీజేపీగానీ మత మార్పిళ్లకు, మత పునఃమార్పిళ్లకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే రాష్ట్రాలు చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం దేశమంతా ప్రశాంతంగా ఉందని, కానీ కొంతమంది అసంతృప్తితో ఉండి ఆ విషయాన్ని రాజకీయ సమస్య చేయాలని చూస్తున్నారని అన్నారు. అలాంటివాటిని బయట చూసుకోవాలని వెంకయ్య సూచించారు.