: కరెంటు షాక్ కు గురైన సహచరిని కాపాడి 'రియల్ హీరో'గా నిలిచిన వానరం


వందల మంది ప్రజల చేత ఆ కోతి రియల్ హీరో అనిపించుకుంది. వివరాల్లోకి వెళితే... అది కాన్పూర్ రైల్వే స్టేషన్. ట్రైన్ లకు విద్యుత్ ను సరఫరా చేసే వైర్ ను తాకిన ఒక కోతి అంత ఎత్తు నుంచి పట్టాలపై పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆ వెంటనే మరో కోతి వచ్చి దానికి సపర్యలు చేయడం ప్రారంభించింది. తట్టిలేపుతూ, పక్కనే ఉన్న నీరు చల్లుతూ కాపాడేందుకు ప్రయత్నించింది. ప్రాణాలు మిగలవనుకుందో ఏమో... ఒక్కసారిగా నీళ్ళలో పడేసి లేపింది. దీంతో, షాక్ కు గురైన వానరానికి కాస్తంత తెలివి వచ్చింది. ఆపై అన్ని కోతులూ కలసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మొత్తం 20 నిమిషాల పాటు సాగిన కోతి సపర్యలను స్టేషన్ లో ఉన్న వందల మంది తిలకించారు. చాలా మంది తమతమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఇప్పుడీ వానరం సోషల్ మీడియాలో 'రియల్ హీరో'! టెలిగ్రాఫ్ వంటి పత్రికలు కూడా ఈ వానరం తెలివిని తెలుపుతూ, వార్తలు ప్రచురించాయి.

  • Loading...

More Telugu News