: మద్యం సిండికేట్ కేసులో పునర్విచారణ జరపాలి: మంత్రి యనమల
విజయనగరం జిల్లా మద్యం సిండికేట్ కేసులో పునర్విచారణ జరపాల్సి ఉందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేసులపై మంత్రివర్గ ఉపసంఘం ఆలోచన చేస్తోందని మీడియాకు చెప్పారు. మద్యం కేసులో కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ తమ్ముడితో పాటు పలువురిని తప్పించారన్నారు. మేఘమథనం పేరిట గాలి, నీరు, మేఘాలను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సంక్రాంతి కానుకగా ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తున్నట్టు చెప్పారు. వ్యాపారంలో పోటీ పడలేకే తన తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారని యనమల పేర్కొన్నారు.