: జడేజాకు గాయం... ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు అక్షర్ పటేల్


ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ (20) ను ఎంపిక చేశారు. భుజం గాయం కారణంగా జడేజా స్వదేశం తిరిగొస్తున్నాడు. దీంతో, నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మిగిలిన రెండు టెస్టుల్లో జడేజా స్థానాన్ని పటేల్ భర్తీ చేస్తాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ గుజరాతీ కుర్రాడు, ఇప్పుడు టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. తాజా రంజీ సీజన్ లో రాణించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. కెరీర్ లో 9 వన్డేలాడిన పటేల్ 14 వికెట్లు తీశాడు. లంకతో 5 వన్డేల సిరీస్ లో పటేల్ 11 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

  • Loading...

More Telugu News