: ఒక్క నిజం చెప్పినా బాబు తల వెయ్యి ముక్కలవుతుంది: జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక ముని శాపం పెట్టాడని, దాని ప్రకారం... నిజం చెబితే బాబు తల వెయ్యి ముక్కలవుతుందని వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ నేడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ అంశంపై జరుగుతున్న చర్చలో భాగంగా చంద్రబాబు ప్రసంగించిన తరువాత జగన్ మాట్లాడుతూ, బాబు నోటి నుంచి ఒక్క నిజం కూడా రాదని, ఆయనకు ఓ ముని శాపం ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీకి దమ్ముంటే తక్షణం ఎన్నికలకు రావాలని జగన్ సవాలు విసిరారు.