: అన్నదాతలు ఆపదలో ఉంటే ఆదుకోలేరా?: టీ.ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న


తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా హైకోర్టు నిలదీసింది. "సెలబ్రిటీలకు డబ్బులు ఇస్తున్నారు, వినోదంపై ఖర్చు పెడుతున్నారు, అదే, అన్నదాతలు ఆపదలో ఉంటే ఆదుకోలేరా...?" అని టీ.ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా సమగ్ర విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు, రెండు వారాల్లోగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. కాగా, గతంలో దాఖలైన ఇలాంటి పిటిషన్ పై ఇప్పటికే కౌంటర్ వేశామని ప్రభుత్వ లాయర్ చెప్పగా, రెండు పిటిషన్లు ఒకేసారి విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది.

  • Loading...

More Telugu News