: దేశంలో తొలి టెర్రరిస్టు గాడ్సే: ఆర్ఎస్ఎస్ పై అజమ్ ఖాన్ మండిపాటు


మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను ఆర్ఎస్ఎస్ కీర్తించడాన్ని సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీ క్యాబినెట్ మంత్రి అజమ్ ఖాన్ తప్పుబట్టారు. గాడ్సే గొప్పవాడు కాదని, దేశంలో తొలి టెర్రరిస్టు అతడేనని విమర్శించారు. గాంధీని చంపిన వ్యక్తిని కొనియాడడాన్ని కాషాయదళం కట్టిపెట్టాలని అన్నారు. ఇక, మత పునఃమార్పిడి అంశంపై ఆర్ఎస్ఎస్ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రధాని పదవికి గుడ్ బై చెబుతానని మోదీ బెదిరిస్తున్నట్టు వచ్చిన వార్తలపైనా ఆయన స్పందించారు. మోదీ అలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోబోరని చెప్పారు. ఆయన అజెండా వేరని తెలిపారు. మత పునఃమార్పిళ్లపై మోదీ నిశ్శబ్దం వీడాలని, లేకుంటే, ఆయన మౌనం ఇతర నేతలకు ప్రేరణలా మారుతుందని అజమ్ ఖాన్ అన్నారు. ఇక, రామమందిరం నిర్మాణం జరగాలంటూ వ్యాఖ్యానించిన యూపీ గవర్నర్ రామ్ నాయక్ పై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

  • Loading...

More Telugu News