: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బలిగొన్న 'దయ్యాలగండి'
విహారయాత్రకు వెళ్లిన వారిని విషాదం చుట్టుముట్టింది. హైదరాబాద్ నుంచి కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ కు వచ్చి, దయ్యాలగండి వద్ద కృష్ణానదిలో జలకాలాటలకు దిగారు. వీరిలో బీహార్‌కు చెందిన విశ్వజిత్ నదిలో మునిగి గల్లంతయ్యాడు. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో విశ్వజిత్ పనిచేస్తున్నట్టు తెలిసింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలువురు నీట మునిగి మరణించిన సంగతి తెలిసిందే.