: జైల్లో గడిపి వచ్చిన నువ్వా... నన్ను వేలెత్తి చూపేది?: జగన్ పై చంద్రబాబు విసుర్లు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేటి శాసనసభలో ఒంటికాలిపై లేచారు. రుణమాఫీపై జరిగిన చర్చలో భాగంగా ఇద్దరి మధ్య వాదప్రతివాదనలు చోటుచేసుకున్నాయి. అవాస్తవాలు చెబుతున్నారంటూ తనపై జగన్ చేసిన ఆరోపణలకు సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘‘అక్రమాలకు పాల్పడి జైల్లో గడిపి వచ్చిన నువ్వా... నన్ను వేలెత్తి చూపేది?’’ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇదే రీతిన మైకు దొరికితే ఇష్టారాజ్యంగా మాట్లాడారని చంద్రబాబు గుర్తు చేశారు. అవకాశం వచ్చిందని ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో తనను వేలెత్తి చూపిన వారు లేరని, జైల్లో గడిపి వచ్చిన జగన్ తనను వేలెత్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు.