: సభలో రన్నింగ్ కామెంట్రీ సభ్యత కాదు: వైకాపాపై చంద్రబాబు ఆగ్రహం


ఏపీ శాసనసభలో విపక్ష సభ్యుల తీరుపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభ్యులకొచ్చే అనుమానాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన ప్రకటించారు. సమస్యలపై మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న వైకాపా సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన సభలో రన్నింగ్ కామెంట్రీ సభ్యత కాదని తేల్చిచెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చెప్పే విషయాలు విపక్షాలకు అర్థం కాకపోతే మరోమారు వివరాల వెల్లడికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అవాస్తవాలతో మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. రుణమాఫీకి కేస్ స్టడీస్ కాదు... రియల్ స్టడీస్ కావాలని ఆయన తెలిపారు. ప్రతిపక్షం బినామీల గురించి మాట్లాడుతోందని చంద్రబాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News