: ఆత్మకథ రాసేందుకు తీరికలేని మన్మోహన్
అధికారానికి దూరమై 200 రోజులు గడచినా ఇంకా బిజీగానే ఉంటున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆత్మకథ రాయడానికి సైతం ఆయనకు తీరిక దొరకనంత బిజీగా కాలం గడుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ప్రతిరోజూ పార్లమెంట్ కు వస్తున్నారు. దీంతో పాటు తన దగ్గరకు వచ్చే ప్రజలను కలుస్తూ, కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా, ఏదో ఒక పనిలో తనను తాను నిమగ్నం చేసుకుంటున్న ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు. కాగా, బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.