: 'జిహాద్' పదం బాగా దుర్వినియోగమవుతోంది: సల్మాన్


కొన్ని రోజుల కిందట పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన దాడిపై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్లో కొన్ని ట్వీట్లు చేశాడు. "జిహాద్ అంటే కష్టపడటం. అంటే చాలా మంచిది. కానీ ప్రస్తుత కాలంలో 'జిహాద్' అత్యంత దుర్వినియోగమవుతోన్న పదం. మతం పేరుతో పిల్లలు, మహిళలు, పలువురుని ఎవరైతే చంపుతున్నారో వారు ఆ పవిత్ర గ్రంధాన్ని (ఖురాన్) చదవడం లేదు" అని సల్మాన్ పేర్కొన్నాడు. అదే సమయంలో మరొకరి ట్వీట్ కు సల్లూ స్పందిస్తూ, భయంకర తీవ్రవాదానికి అమాయక పిల్లల ప్రాణాలను బలి చేస్తూ పెషావర్ దాడి చేయడం ఇస్లాం కాదని రీట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News