: బాధతో గుండె బద్దలైందంటున్న అల్ ఖైదా
పాకిస్థాన్ లో తెహ్రీక్-ఏ-తాలిబన్ గ్రూపు పెషావర్ సైనిక పాఠశాలపై దాడిచేసి చిన్నారులను బలిదీసుకోవడాన్ని ఉగ్రవాద సంస్థలు సైతం తప్పుబడుతున్నాయి. పాక్ లో అల్ ఖైదా పెషావర్ విభాగం దీనిపై స్పందిస్తూ, బాధతో గుండె బద్దలైందని పేర్కొంది. మిలిటెంట్లు భద్రతా బలగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని సూచించింది. అల్ ఖైదా దక్షిణాసియా విభాగం ప్రతినిధి ఒసామా మెహమూద్ తాలిబన్ల దుశ్చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల ఈ-మెయిల్ ప్రకటనను మీడియాకు పంపారు. "సోదర తాలిబన్ల కిరాతకాన్ని ఆఫ్ఘన్ తాలిబన్ గ్రూపు కూడా ఖండించింది. అమాయక బాలలను చంపడం ఇస్లాంకు వ్యతిరేకం" అని పేర్కొంది.