: ఆ సన్నివేశం తొలగించాం, ఇక వివాదం వద్దు: భట్రాజు సంఘానికి 'లింగ' నిర్మాత విజ్ఞప్తి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగ' చిత్రంలోని ఒక సన్నివేశం, అందులోని సంభాషణలు 'భట్రాజు' వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన విమర్శలపై నిర్మాత 'రాక్ లైన్' వెంకటేష్ స్పందించారు. ఆ సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించినట్టు ఆయన తెలిపారు. తమ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకులూ ముఖ్యమేనని, ఏ వర్గాన్నీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదనీ, పొరపాటున ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే అందుకు మన్నించాలని కోరారు.