: హఫీజ్ సయీద్ ను 'సాహెబ్'గా అభివర్ణించిన యూఎన్... వివరణ కోరిన ఇండియా


ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ ను ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ పానెల్ 'సాహెబ్' అని అభివర్ణించింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ చీఫ్ గ్యారీ క్విలాన్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యపై ఇండియా వివరణ కోరింది. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 2008లో జమాత్-ఉద్-దవాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హఫీజ్ సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనను 'సాహెబ్'గా సంబోధించడంపై భారత్ ఆగ్రహంగా ఉంది.

  • Loading...

More Telugu News