: సభ నుంచి వైకాపా వాకౌట్
శాసనసభ సమావేశాల నుంచి ప్రతిపక్షం వైకాపా నేడు వాకౌట్ చేసింది. కాంట్రాక్టు సిబ్బంది ఆందోళనపై సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని ఎన్నికల నాడు ప్రకటనలు గుప్పించిన టీడీపీ, అధికారం చేపట్టిన తర్వాత ఉన్న ఉద్యోగాలను తొలగిస్తోందని ఈ సందర్భంగా జగన్ ఆరోపించారు. నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని అడ్డుకోవడం సరికాదన్నారు. సర్కారు నిరంకుశ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు.