: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి పులి
ఉత్తర భారతంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటిదాకా శూన్య స్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతలు నేటి ఉదయం మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 4.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో నగరం మొత్తం పొగమంచు గుప్పిట్లో చిక్కుకుంది. నేటి ఉదయం బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరనుంది. దాదాపు 17 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రతల నేపథ్యంలో గడచిన పది రోజుల వ్యవధిలో ఉత్తరాఖండ్ లో 30 మంది దాకా మృత్యువాత పడ్డారు. ఉత్తరప్రదేశ్ లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.