: పొగమంచు గుప్పిట్లో ఢిల్లీ


దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు చుట్టేసింది. దట్టమైన పొగమంచు గుప్పిట్లో కూరుకుపోయిన ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. రవాణా వ్యవస్థపై పొగమంచు పెను ప్రభావాన్నే చూపింది. దీంతో నేటి విమాన, రైళ్ల రాకపోకల్లో పలు మార్పులు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 50 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. 12 రైళ్ల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. ఇదిలా ఉంటే, 12 విమాన సర్వీసుల వేళల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

  • Loading...

More Telugu News