: కేంపస్ ఇంటర్వ్యూల్లో ఖరగ్ పూర్ ఐఐటీ హవా


కేంపస్ ఇంటర్వ్యూల్లో (ప్రాంగణ నియామకాల్లో) ఖరగ్ పూర్ ఐఐటీ సత్తా చాటింది. ఈ ఏడాది దేశం మొత్తం మీద జరిగిన కేంపస్ ఇంటర్వ్యూల్లో అత్యధిక మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దక్కేలా ఆ కళాశాల చర్యలు తీసుకుంది. కేంపస్ ఇంటర్వ్యూల్లో భాగంగా తొలిదశ నియామకాలు శనివారంతో ముగిశాయి. తొలి దశలోనే ఖరగ్ పూర్ ఐఐటీలో విద్యనభ్యసించిన 1050 విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించాయి. మొత్తం 1100 ఉద్యోగాలు విద్యార్థుల ముంగిట్లో వాలేలా చేసిన ఖరగ్ పూర్ ఐఐటీ, ఈ విషయంలో మిగిలిన అన్ని కళాశాలల కంటే అత్యుత్తమంగా రాణించింది. ఈ ఇంటర్వ్యూల నిమిత్తం ఈ ఏడాది దాదాపు 200లకు పైగా కంపెనీలు హాజరయ్యాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్ లాంటి విదేశీ కార్పొరేట్ దిగ్గజాలతో పాటు హిందూస్థాన్ లీవర్, ఐటీసీ, ఫ్లిప్ కార్ట్, కాగ్నిజంట్ లాంటి దేశీయ కార్పొరేట్ సంస్థలు కూడా ఈ ఏడాది కేంపస్ ఇంటర్వ్యూల్లో పాలుపంచుకున్నాయి.

  • Loading...

More Telugu News