: థాయ్ లాండ్ లో పెళ్లి చేసుకునే భారతీయ జంటలకు బంపర్ ఆఫర్
ప్రముఖ పర్యాటక కేంద్రమైన థాయ్ లాండ్ లో పెళ్లి చేసుకునే భారతీయ జంటలకు అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ధాయ్ లాండ్ లో వివాహం చేసుకునేందుకు భారతీయులు ఈ మధ్య కాలంలో బాగా ఆసక్తి చూపుతున్నారని చెప్పిన థాయ్ ప్రధాని, వారిని ఆకర్షించేందుకు ఓ సరికొత్త ప్రతిపాదన చేశారు. థాయ్ లాండ్ లో పెళ్లి చేసుకునేందుకు వచ్చే భారతీయ జంటలను వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లేందుకు ఛార్టర్డ్ విమానం వినియోగిస్తే బాగుంటుందనుకుంటున్నట్టు వెల్లడించారు. చార్టర్డ్ విమానంలో వివాహ వేదిక వద్దకు వధూవరులను తీసుకెళ్లి, వారి వివాహాన్ని మరపురాని మధురానుభూతిగా మిగిలిస్తే ఎలా ఉంటుందని ఆయన ఓ టీవీ కార్యక్రమంలో పేర్కొన్నారు. థాయ్ లాండ్ లో వివాహ వేడుకల నిర్వహణ తీరుకు భారతీయ జంటలు ముగ్థులవుతున్నారని ఆయన పేర్కొన్నారు.