: పొన్నాల, కుంతియా సమీక్షా సమావేశం రసాభాస
గాంధీ భవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో వరుసగా టీపీసీసీ చీఫ్ పొన్నాల, ఏఐసీసీ కార్యదర్శి ఆర్ సీ కుంతియా సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నేతల సమీక్ష సందర్భంగా సీనియర్ నేత డీఎస్, మహేష్ కుమార్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాను పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో అనవసర జోక్యం చేసుకోవడం మానేయాలని డీఎస్ కు మహేష్ సూచించారు. దీంతో ఆయన మండిపడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది.