: కేసీఆర్ మెప్పు కోసమే పవన్ కల్యాణ్ పై పుస్తకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కోసమే హైదరాబాదుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనే రచయిత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ కల్యాణ్ హఠావో... పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశారని శ్రీకాకుళం జిల్లా పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నేతలు ఆరోపించారు. శ్రీకాకుళంలో పవన్ కల్యాణ్ అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే శ్రీనివాస్ ఆ పుస్తకం రాశారని అన్నారు. కేసీఆర్ మెప్పుకోసం రచయిత దిగజారిపోయారని వారు మండిపడ్డారు. అధికారం కోసం తాను పార్టీ పెట్టలేదని, ప్రజా సంక్షేమం మరచిపోయిన నేతలను ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టానని జనసేన పార్టీని ప్రకటించిన సందర్భంగా పవన్ కల్యాణ్ చేప్పిన సంగతిని వారు గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ గురించి ఏమీ తెలియని, అతని ఆలోచనలను అర్ధం చేసుకోలేని వ్యక్తులు అతనిపై విమర్శలు గుప్పించడం ఎంత వరకు న్యాయమో అతనే ఆలోచించాలని వారు సూచించారు.