: రూ.100 దొంగిలించాడని కార్మికుడిని చితకబాదిన తిరుమల హోటల్ యజమాని
తిరుమలలోని ఓ ప్రైవేట్ హోటల్ యజమాని, తన హోటల్ లో పనిచేస్తున్న కార్మికుడిని చితకబాదాడు. కేవలం రూ.100 దొంగిలించాడన్న ఆరోపణలపై యజమాని బెల్టుతో చేసిన దాడిలో కార్మికుడి శరీరం మొత్తం వాతలు తేలింది. యజమాని దాడితో మనస్తాపం చెందిన కార్మికుడు, తోటి కార్మికులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తొలుత కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితుడు హోటల్ ముందు ధర్నాకు దిగాడు. చివరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ యజమానిని విచారిస్తున్నారు. అకారణంగా తనపై దాడి చేసిన హోటల్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని బాధితుడు చెబుతున్నాడు.