: 500 మంది గిరిజనులను క్రైస్తవం నుంచి హిందూ మతంలోకి మార్చాం: వీహెచ్ పీ


క్రైస్తవులుగా కొనసాగుతున్న 500 మంది గిరిజనులను హిందూ మతంలోకి మార్చామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. గుజరాత్ లోని సూరత్ కు సమీపంలోని వల్సాద్ లో శనివారం చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంలో భాగంగా గిరిజనులను హిందూ మతంలోకి తీసుకొచ్చామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి తాము ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని ప్రకటించిన ఆ సంస్థ, చట్టాన్ని మాత్రం ఉల్లంఘించలేదని పేర్కొంది. మత మార్పిడిలో గిరిజనులను తాము బలవంతపెట్టలేదని వల్సాద్ వీహెచ్ పీ కార్యదర్శి అజిత్ సోలంకి చెప్పారు.

  • Loading...

More Telugu News