: కావలిలో డ్రగ్స్ కలకలం...పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేటి ఉదయం డ్రగ్స్ కలకలం రేగింది. నిషేధిత మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులను పట్టణంలోని వెంగళ్రావునగర్ లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35 లక్షల నగదు,700 గ్రాముల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్న అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులకు హైదరాబాద్ లోని డ్రగ్స్ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.