: కుక్కకాటుకు మందులేదన్న వైద్యుడు...సస్పెండ్ చేసిన ఆరోగ్య మంత్రి కామినేని
కుక్కల దాడిలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి వచ్చిన బాలుడికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుడు చంద్రశేఖర్ పై సస్పెన్షన్ వేటు పడింది. కుక్కకాటు మందులు లేవన్న వైద్యుడు, బాలుడిని గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లమని చెప్పారు. విషయం తెలుసుకున్న ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. పరిస్థితిని సమీక్షించిన మంత్రి, వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. దీంతో వైద్యుడు చంద్రశేఖర్ ను సస్పెండ్ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో మరో వైద్యుడికి మంత్రి చార్జిమెమో జారీ చేశారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా మంత్రి కామినేని వైద్యులకు హెచ్చరికలు జారీ చేశారు.