: నందిగామలోనూ పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్... 37 మంది రౌడీ షీటర్ల అరెస్ట్
కృష్ణా జిల్లా నందిగామలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 37 మంది రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నందిగామలో ఇటీవల పెరిగిన చోరీల నేపథ్యంలోనే కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను నిర్వహించామని నందిగామ డీఎస్పీ చెప్పారు. నేరాల అదుపునకు ఈ తరహా చర్యలు తప్పవని ఆయన వెల్లడించారు. ఇకపై కూడా ఈ తరహా సోదాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.