: ఉత్తర భారతంలో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత...యూపీలో చలి తీవ్రతకు 8 మంది మృతి
ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాలు చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లో చలి తీవ్రతను తట్టుకోలేక ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పొగమంచు కారణంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రైలు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. చండీగఢ్ నుంచి నేటి ఉదయం వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.