: సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్ లో కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు...ఆరుగురి అరెస్ట్
సికింద్రాబాద్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నేటి తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ సోదాల్లో దాదాపు 300 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా 24 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్రిస్ మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోరాదన్న భావనతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.