: తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టిన అమీర్ ఖాన్ 'పీకే'
అమీర్ ఖాన్ తాజా సినిమా 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. భారత్ లోనే 26.63 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ చిత్రానికి తొలిరోజే హిట్ టాక్ వచ్చింది. దీంతో వీకెండ్ లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వసూళ్లు ఇలాగే స్థిరంగా కొనసాగితే ఈ సినిమా 300 కోట్ల మార్కును దాటుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'పీకే'కి విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. అమీర్ సరసన అనుష్క శర్మ నటించగా, ఇతర పాత్రల్లో సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సౌరభ్ శుక్లా తదితరులు నటించారు. గత క్రిస్మస్ ముందు విడుదలైన అమీర్ సినిమా 'ధూమ్-3' కూడా మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.