: ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ధార్మిక సిబ్బందికి శుభవార్త


చిన్న చిన్న దేవాలయాల్లో పనిచేస్తున్న ధార్మిక సిబ్బందికి జనవరి 1 నుంచి నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేవాలయాల్లోని ధార్మిక సిబ్బంది గౌరవ వేతనం కోసం 250 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ నిర్ణయం కారణంగా 2,545 మంది ధార్మిక సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News