: బీరు సీసాలపై గాంధీ బొమ్మేయడం అవమానం: వీహెచ్
అమెరికాలో బీరు సీసాలపై గాంధీ బొమ్మ వేయడం భారతీయులందరికీ అవమానమని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీరు సంస్థ చర్యను భారతీయులంతా తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. దీనిపై ప్రధాని మోదీ తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సంస్థపై చర్యలు తీసుకునేలా ప్రధాని అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.