: గర్భిణీ స్త్రీలకూ మధ్యాహ్న భోజన పథకం: హరీశ్ రావు
తెలంగాణలోని అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడతామని చెప్పారు. కుటుంబంలోని ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తామని హరీశ్ పునరుద్ఘాటించారు.