: రెండు ముక్కలైన ఆర్టీసీ బస్సు స్టీరింగ్... 40 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్


గుంటూరు జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నేటి ఉదయం సత్తెనపల్లి నుంచి అమరావతి బస్సు బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్ చేతిలోని స్టీరింగ్ అకస్మాత్తుగా విరిగింది. దాంతో బస్సు డ్రైవర్ సడన్ బ్రేకు వేశారు. దీంతో అదుపుతప్పిన బస్సు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయి, పొలం గట్టును ఢీకొట్టి నిలిచింది. అప్పటికే తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. మరో వాహనాన్ని ఢీకొట్టకుండా బస్సు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయానికి బ్రేక్ లు వేయకుంటే తమ ప్రాణాలు పోయేవని ప్రయాణికులు తెలిపారు.

  • Loading...

More Telugu News