: గుంటూరు కాలేజీలో ర్యాగింగ్‌ భూతం... సీఎం పేషీలో ఫిర్యాదు చేసిన విద్యార్థిని


గుంటూరు మెడికల్‌ కాలేజీలో ప్రాణాలను ఎలా కాపాడాలో నేర్చుకోవాల్సిన విద్యార్థులు తోటివారిని హింసించడం ఎలాగన్న విషయంపై విద్యను అభ్యసిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు చేస్తున్న ర్యాగింగ్‌ ను, పెడుతున్న హింసనూ తట్టుకోలేక ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్‌ ఖాళీచేసి వెళ్లిపోయింది. అంతేకాదు, జరిగిన దారుణాలను ధైర్యంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. నెల్లూరుకు చెందిన ఆ విద్యార్థిని ర్యాగింగ్‌పై సీఎం పేషీలో వివరాలు అందించింది. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్‌ హాస్టల్‌ను తనిఖీ చేసి, ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News